టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మహా సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. గయానా వేదికగా ఈరోజు మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఓటమెరుగుని భారత్ ఇంగ్లండపై కూడా విజయఢంకా మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
2022 టీట్వంటీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ పోరులో భారత్ ను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరింది. ఇక ఈ సారి భారత్ కు రివేంజ్ తీసుకునే సమయం వచ్చిందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. సాయంత్రం జరిగే భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక రికార్డుల పరంగా భారత్ , ఇంగ్లాండ్ ఇద్దరూ సమవుజ్జిలే.. టీ 20 ఫార్మాట్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు పోటీ పడగా 12 మ్యాచుల్లో భారత్, 11 మ్యాచుల్లో ఇంగ్లాండ్ గెలిచింది.