ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని రాజ్‌వ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబైతో జరిగిన ఇన్నింగ్స్‌లో SRH 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేరిట ఉన్న 2013 నాటి రికార్డును బద్దలు కొట్టి పోటీ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. మయాంక్ (11), ట్రావిస్ హెడ్ (65), అభిషేక్ శర్మ(63), మార్ క్రమ్(45 నాటౌట్), క్లాసెన్(80 నాటౌట్) ఆటతో ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోశారు.