క్రికెట్ ప్రపంచకప్ లో రికార్డులు బద్దలు అవుతున్నాయి. మనదేశంలో జరుగుతున్నవన్డే ప్రపంచ కప్ లో అత్యధిక స్కోర్ నమోదు అయింది. దక్షిణాఫ్రిక-శ్రీలంక మద్య ఈ రోజు జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రిక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికట్లు మాత్రమే నష్టపోయి 428 భారీ పరుగులు చేసింది. అంతే కాకుండా ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు ఆటగాళ్ళు సెంచరీలతో చెలరేగిపోయారు. క్వింటన్ డికాక్ (100), వాండర్ డస్సెన్ (108), ఎడెన్ మార్‌క్రమ్ లు శతకాలు నమోదు చేశారు. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్. శ్రీలంక గెలవాలంటే రికార్డు స్థాయిలో మరో అత్యధిక స్కోర్ తప్పక నమోదు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచకప్ మొదలు అయిన మూడు రోజులకే రికార్డులు బద్దలు అవడం ప్రారంభం అయ్యాయి అంటే, ఇంకా ముందు ముందు ఎన్ని రికార్డులు నమోదు అవుతాయో ఏమో కానీ, క్రికెట్ ప్రేక్షకులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.