ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు 8,848.86 మీ. గత ఐదు కోట్ల సంవత్సరాలుగా దీని ఎత్తు పెరుగుతోనే ఉంది. ఈ పర్వతం సముద్ర మట్టానికి 8.85 కి.మీ ఎత్తులో ఉంటుంది. గతంతో పోలిస్తే అత్యంత వేగంగా ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరుగుతోందని నేచర్ జియో సైన్స్ జర్నల్ లో పబ్లిష్ అయిన తాజా పరిశోధన కథనం చెబుతోంది. ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నయని తెలుస్తోంది. భూమిలోపల జరిగే అనేక జియోలాజికల్ మార్పులే దీని హైట్ పెరుగుదలకు కారణమని అంటున్నారు. మనం నివసిస్తున్న భూమి నిరంతరం మార్పులకు గురి అవుతూ ఉంటుందని ఈ కథనం తెలియజేస్తుంది. అయితే ఆమార్పులను మనం గమనించలేక పోవచ్చు, చూడలేకపోవచ్చు. కాని భూమి నిరంతరం మార్పు చెందుతూనే ఉంది.. అనే దానికి ఎవరెస్ట్ ఎత్తు పెరుగుదలకు కారణం.
ఎత్తు ఎందుకు పెరుగుతోంది..?
గాలి, వర్షం, నీరు ఈ మూడింటి వల్ల ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతోంది. 89 వేల సంవత్సరాల క్రితం కోసి, అరుణ్ నదులు కలిసిపోవడం వల్ల ఎవరెస్ట్ ఎత్తు 15 -50 మీ. ఎత్తు పెరిగింది. దీనికి కారణం ఈ నదులు కలిసి పోవడం వలన భూమి పెద్దఎత్తున కోతకు గురై భూమిపై ఉన్న రాక్ సాయిల్ కొట్టుకొని వెళ్లి.. భూమిపైన ఒత్తిడి కారణంగా దీని పక్కనున్న పర్వత శ్రేణులు కానీ, లేదా ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరుగుదలకు కారణం అవుతుందని అధ్యయనం తెలియజేస్తుంది. పర్వతాల ఎత్తు పెరగడం అనేది ఒకేసారి కాకుండా.. ధీర్ఘ కాలంలో భూగర్భంలో వచ్చే పరిణామక్రమంలో ఎత్తు పెరగడానికి కారణం అవుతుంది.