అమెరికా అధ్యక్షడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరిలో నుండి తప్పుకొనే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే గత కొన్నిరోజులుగా ట్రంప్, బైడెన్ ల టీవీ చర్చల్లో ట్రంప్ దే పై చేయి వస్తూ ఉంది. బైడెన్ పోటీనుండి తప్పుకోవాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అయితే, వయసు రీత్యా వచ్చిన ఇబ్బందులను అంగీకరించిన బైడెన్.. తనకు నిజం మాట్లాడటం మాత్రమే తెలుసని అన్నారు. తద్వారా తాను పోటీలోనే ఉంటానని బైడెన్ సంకేతాలు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్ష పోటీలో రిపబ్లికన్ పార్టీ నుండి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీనుండి బైడెన్ లు ఇద్దరూ కూడా అభ్యర్ధులుగా ఉండాలని పార్టీలో అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే.