ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి ప్రస్తుతం ఉంది. శని ఆదివారాలు సెలవులుగా ఉంటున్నాయి. మన దేశం విషయానికి వస్తే పలు కార్యాలయాల్లో వారానికి ఆరు రోజులు, మరికొన్ని సంస్థల్లో ఐదురోజుల పని విధానం కొనసాగుతుంది. కానీ తాజాగా జపాన్(japan) ఉద్యోగుల పని విధానంలో పలు కీలక మార్పులను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారానికి నాలుగు రోజులు(4 days work) పని చేయాలనే ప్రతిపాదనకు జపాన్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉద్యోగులు తమ పిల్లలను పెంచడం, వృద్ధ బంధువులను చూసుకునే వారు ఉద్యోగాల్లో ఎక్కువ కాలం ఉండేందుకు వీలుపడుతుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. దీనిపై ముందుకు వెళ్లేందుకు జపాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత
RELATED ARTICLES