ఇంగ్లండ్‌లోని లీడ్స్ మైదానంలో జరుగుతున్న India vs England మద్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 152 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కలిపి వంద పరుగుల మార్కును అందుకున్నాడు. జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం 74 బంతుల్లో 58 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 78 బంతుల్లో 42 పరుగులు చేసి గౌరవప్రదమైన ఇన్నింగ్స్‌ను అందించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, 51 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగితే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read..| Sai Pallavi: ‘కుబేర’ పై సాయి పల్లవి ప్రశంసల జల్లు
ఈ అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. గత పదేళ్లుగా భారత టెస్టు జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా యువ జట్టు బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. యువ ఆటగాళ్లు ఈ అవకాశం ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
📸 📸
— BCCI (@BCCI) June 20, 2025
A celebratory run 👌
The hands aloft 🙌
The trademark jump ☺️
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/E4PDGDOKEb