‘కుబేర’ పై సాయి పల్లవి ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నాగార్జున, ధనుష్‌ల మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’ ఈరోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా, నటి సాయి పల్లవి తన సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, చిత్ర బృందం అంతా ఈ విజయాన్ని ఆస్వాదించాలని ఆమె ఆకాంక్షించారు.
‘కుబేర’పై సాయి పల్లవి ప్రశంసల జల్లు
సాయి పల్లవి తన సందేశంలో ‘కుబేర’ ఒక అసాధారణ చిత్రమని అన్నారు. “సవాలుతో కూడిన, విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ధనుష్, ఈ సినిమాలోనూ తన నటనతో అద్భుతాలు సృష్టిస్తారని, ఇది అభిమానులకు ఒక గొప్ప విందు భోజనం అవుతుంది” అని ఆమె అన్నారు. అలాగే, నాగార్జున పాత్ర గురించి మాట్లాడుతూ, “శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జునను ఇలాంటి శక్తివంతమైన పాత్రలో చూడటం నిజంగా అభిమానులకు పండుగే. వారి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది” అని అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రంలో రష్మిక మందాన పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఆమె నటన సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని సాయి పల్లవి తెలిపారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించిన సాయి పల్లవి, “దేవి శ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఉత్తమ ఆల్బమ్‌లలో ఇది ఒకటి అవుతుందని, పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసాయి” అని ప్రశంసించారు.
శేఖర్ కమ్ములపై సాయి పల్లవి ఆత్మీయ వ్యాఖ్యలు
తనకెంతో ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ములపై సాయి పల్లవి హృదయపూర్వక వ్యాఖ్యలు చేశారు. “శేఖర్ కమ్ముల తనకెంతో దర్శకుడని తెలిపారు. స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి అని, తన కథలతో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారని అన్నారు. ఆ స్ఫూర్తిని పొందిన వారిలో తాను కూడా ఉన్నానని అని ఆమె అన్నారు. ఒక గురువుగా శేఖర్ కమ్ముల తనపై చూపిన ప్రభావాన్ని సాయి పల్లవి గుర్తు చేసుకున్నారు.
Also Read…| అక్టోబర్ 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం
“నా గురువుగారు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథలెన్నో మనకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని సాయి పల్లవి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం పగలు రాత్రి కష్టపడిన ప్రతి ఒక్కరికీ, తెర వెనుక పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ ప్రశంసలు దక్కాలని ఆమె కోరారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. సాయి పల్లవి వ్యాఖ్యలు ‘కుబేర’ చిత్రంపై సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
#Kuberaa is going to be special for many reasons! @dhanushkraja sir’s masterclass in acting & art of picking challenging characters that only he can pull off so effortlessly. @iamnagarjuna sir, It’s going to be a treat to watch you in a killer character under Sekhar garu’s…
— Sai Pallavi (@Sai_Pallavi92) June 20, 2025