క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టారు. ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రోజు వరకూ రోహిత్ శర్మ 554 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డు విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (553 సిక్సర్లు) పేరుతో ఉండేది. వరల్డ్ కప్ లో 63 బంతుల్లోనే 100 పరుగులు చేశారు. భారత్ తరఫున వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఇంతకు ముందు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ దేవ్ వరల్డ్ కప్ లో 72 బంతుల్లో సెంచరీ చేసిన చేశాడు. అంతేకాదు, రోహిత్ శర్మ వరల్డ్ కప్ లలో 19 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి (1000) పరుగుల మార్కును కూడా అధిగమించాడు అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ 19 ఇన్నింగ్స్ ల్లో, సచిన టెండూల్కర్ 20 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగుల రికార్డులు ఉండేవి.