దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య ఫిరోజ్‌షా కోట్లా గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన సౌతాఫ్రికా జట్టు అత్యధిక రికార్డు స్కోరు చేసినా.. ఓటమి ఎదురైనా బరీలంక మంచి ఆట తీరును కనబరిచింది. 102 పరుగుల తేడాతో శ్రీలంకపై సఫారీలు విజయం సాధించారు. టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 428/5 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 రన్స్ కు ఆలౌటైంది.