హైదరాబాద్ స్టార్ షూటర్, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్‌ను భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
తెలంగాణ స్టార్ షూటర్ ఈషా సింగ్ (Esha Singh)పారిస్ ఒలింపిక్స్ లో (Paris Olympics)తన బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జకార్తాలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచి, ఈషా ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.