Thursday, April 17, 2025
HomeSportsWorldCup 2023 IND vs SL: ఇండియా ఆల్ రౌండ్ షో.. శ్రీలంకపై భారీ విజయం.....

WorldCup 2023 IND vs SL: ఇండియా ఆల్ రౌండ్ షో.. శ్రీలంకపై భారీ విజయం.. నేరుగా సెమీస్ కే

శ్రీలంకపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 302 పరుగుల భారీ తేడాతో విజయా ఢంకా మోగించింది. నేరుగా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. వరల్డ్ కప్ లో ఇండియా ప్లేయర్ల ఆట దెబ్బకు ప్రత్యర్థులు ఖంగుతిన్నారు. 2023 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఇండియా ఓడిపోలేదు. ఆడిన 7 మ్యాచ్ లలో ఏడింటిలో గెలిచింది. తాజాగా గురువారం శ్రీలంకతో జరిగిన ఆటలో గెలిచి పాయింట్ల టేబుల్ లో మొదటిస్థానంలో ఉంది. ముందుగా టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 357 పరుగులు చేసింది. విరాట్ కొహ్లి, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు. వారు సెంచరీకి దగ్గరగా వచ్చి అవుటయ్యారు. చివరలో జడేజా విజృంభించి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లను బుమ్రా, సిరాజ్, షమి చావు దెబ్బ తీశారు. పరుగులు తీయడం శ్రీలంక బ్యాటర్ కు కష్టంగా మారిందంటే ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్లు డకౌట్ గా వెనుదిరిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక ఆటగాళ్లు ఒక్కరు కూడా క్రీజులో నిలువలేక పోయారు. ఇండియా 302 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయా ఢంకా మోగించింది. దీంతో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లు అయింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments