మహిళలు మద్యపానం సేవించడం (women alcohol drink) సంపన్నకుటుంబాలలో సర్వసాదారణం అయిపోయింది. ఆ మాటకు వస్తే సంపన్న కుటుంబాలలోనే కాకుండా ఎగువ మద్యతరగతి మహిళలతో పాటు చాలా కుటుంబాల్లో ఈ పద్దతి కనిపిస్తుంది. మద్యపానం సేవించిన తరువాత దాని ప్రభావం పురుషలతో పోలిస్తే స్త్రీలలో ఎక్కవ సమయం ఉంటుంది. శరీర నిర్మాణాలు కూడా పురుషులవి, స్త్రీలవి వేరు వేరుగా ఉంటాయి. సైంటిఫిక్ గా కూడా చాలా తేడాలు ఉంటాయి కాబట్టి వారి శరీర నిర్మాణంలో ఆడ, మగ మద్య తేడాలు ఉంటాయి. మహిళల శరీరాల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. నీరు తక్కువగా ఉంటుంది. అదే పురుషుల విషయానికి వస్తే నీరు ఎక్కువగా, ఫ్యాట్ తక్కువాగా ఉంటుంది. దీనివల్ల డీహైడ్రేట్ (dehydrate) సమస్యలు పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ కారణం వలనే మహిళలు మద్యం సేవిస్తే ఎక్కువ సమయం దాని ప్రభావం వారి శరీరంలో ఉంటుందని అంటున్నారు. యుక్త వయసులోని మహిళలు ఆల్కాహాల్ తీసుకుంటే శారీరక అభివృద్ధి తక్కువగా ఉంటుందని అంటున్నారు. మహిలల్లో లివర్ పాడవడంతో పాటు, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే, ఇతర దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. అదే విధంగా, వృద్దులు మద్యం సేవించండం వలన వారిలో కొద్దిమేరకు సానుకూల ఫలితాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Alcohol: మద్యపానం వల్ల పురుషులకంటే మహిళలకే ఎక్కువ ప్రమాదం
RELATED ARTICLES