Menu

  • Home
  • జాతీయం
  • Republic day Tableau: తెలంగాణ రాష్ట్ర శకటం పేరు ‘జయ జయహే తెలంగాణ’
Image

Republic day Tableau: తెలంగాణ రాష్ట్ర శకటం పేరు ‘జయ జయహే తెలంగాణ’

దిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్ (రాజ్ పథ్) ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’ గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజా కవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కుమురం భీం, రాంజీ గోండు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారులు జానపదాలను ప్రదర్శించనున్నారు. దిల్లీలో శకట ప్రదర్శనకు సంబంధించి పూర్తి స్థాయి డ్రెస్‌ రిహార్సల్‌ నిర్వహించారు.

Share the post

Also Read..