Menu

News

VinGroup to invest in Telangana

తెలంగాణపై విన్‌గ్రూప్ ఫోకస్.. EV పెట్టుబడులపై ఆసక్తి

విన్‌గ్రూప్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పె ఆసక్తి కనబర్చారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్‌గ్రూప్ కంపెనీ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ యూనిట్లు, బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను స్థాపించేందుకు విన్‌గ్రూప్ ఆసక్తి చూపిస్తుంది. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు […]

తెలంగాణపై విన్‌గ్రూప్ ఫోకస్.. EV పెట్టుబడులపై ఆసక్తి Read More »

AP is a gateway to the world market says cm Chandrababu

ప్రపంచ మార్కెట్‌కు గేట్‌వే ఏపీ : చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం సహజ వనరులను, వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రస్తావించారు. విశాఖ ఒక అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇది మంచి వనరులకు ఆలవాలమని సీఎం అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను, అత్యాధునిక సాంకేతికతలో ఏపీ సాధిస్తున్న ముందడుగును యూరప్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అమెరికా వెలుపల గూగుల్ తన అతిపెద్ద

ప్రపంచ మార్కెట్‌కు గేట్‌వే ఏపీ : చంద్రబాబు నాయుడు Read More »

TG CS Reviews on President, vice president visit to Hydedrabad

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21వ తేదీన రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సచివాలయంలో ఉన్నతాధికారులతో ఏర్పాట్ల సమీక్షించారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని, ఆయా డిపార్ట్‌మెంట్ల వారీగా నోడల్ ఆఫీసర్‌ను నియమించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటన వివరాలను

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష Read More »

dharna will be held in front of cm house says MLC kavitha

అలసత్వం వహిస్తే సీఎం ఇంటి ముందు ధర్నాచేస్తా: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా నది జలాల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని కవిత హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ను విమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా పాత పద్ధతులనే కొనసాగిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఎస్ఎల్‌బీసీ,

అలసత్వం వహిస్తే సీఎం ఇంటి ముందు ధర్నాచేస్తా: ఎమ్మెల్సీ కవిత Read More »

jublee hills by election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.47% ఓటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills ByPoll 2025 ) ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం ఓటర్లలో కేవలం 48.47 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.47% ఓటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ Read More »

AndeSri Passed away

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన మరణవార్త తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, దుఃఖాన్ని నింపింది. సికింద్రాబాద్ లాలాగూడలోని తన నివాసంలో తెల్లవారుజామున కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 7:25 గంటలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతికి గుండెపోటు

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత Read More »

Auto driver

ఆటో నడుపుతూ డ్రైవర్ సరసాలు..! వీడియో వైరల్

హైదరాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆటో నడుపుతూ డ్రైవర్ సరసాలు వీడియో వైరల్ గా మారింది. ఆటోలో యువతిని పక్కన కూర్చోబెట్టుకుని, ఆమెతో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తూ ఆటో నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి రంగంలోకి దిగారు. ఈ సంఘటన శుక్రవారం మలక్‌పేటలోని నల్లగొండ చౌరస్తా నుండి చాదర్‌ఘాట్ బ్రిడ్జి మార్గంలో

ఆటో నడుపుతూ డ్రైవర్ సరసాలు..! వీడియో వైరల్ Read More »

cm revanth reddy sensation comments on kishan reddy and ktr

కేటీఆర్, కిషన్ రెడ్డిలు ‘బ్యాడ్ బ్రదర్స్’ : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. కేటీఆర్, కిషన్ రెడ్డిలు ‘బ్యాడ్ బ్రదర్స్‘ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బీఆరెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2004-2014 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని, 2014-2023 మధ్య అధికారంలో ఉన్న బీఆరెస్ అభివృద్ధిని పోల్చి చూసి ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ

కేటీఆర్, కిషన్ రెడ్డిలు ‘బ్యాడ్ బ్రదర్స్’ : సీఎం రేవంత్ రెడ్డి Read More »

chandrababu-and-his-wife-receives- grand-welcome-in-london

లండన్ లో సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని తెలుగు వారు సీఎం దంపతులకు ఘన స్వాగతం పలికారు. తెలుగువారిని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. ఈ పర్యటనలో నారా భువనేశ్వరికి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కనుంది. ఆమె ఈ నెల 4వ తేదీన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) నుంచి ఒకే వేదికపై రెండు

లండన్ లో సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం Read More »

KTR fires on congress government

రాష్ట్రంలో పాలన పడకేసింది : కేటీఆర్

రాష్ట్రంలో పాలన పడకేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం జరుగుతోందని, వారు పండించిన ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితి లేదని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు బోనస్‌, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు

రాష్ట్రంలో పాలన పడకేసింది : కేటీఆర్ Read More »