సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్

తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ – యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇలా సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ మార్చి 16, 2024 నాడు రాశారు.

ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గారు గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది.ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img