పార్టీ ఉంటేనే ప్రభుత్వం.. పార్టీ పటిష్టంగా ఉంటేనే అధికారం సుస్థిరం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. ప్రభుత్వం, పార్టీ అనే రెండు పట్టాల మీద బండి సజావు గా సాగితేనే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పనితీరు ఎలా ఉంది? 2025లో రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటి? కులగణన నుంచి సర్పంచ్ ల ఎన్నిక వరకు పీసీసీ చీఫ్ నిర్ణయాలు పార్టీకి ఏ మేరకు మేలు చేశాయి? అసలు ప్రభుత్వం – పార్టీ మధ్య సమన్వయం కుదిరిందా? లేక అంతర్గత విభేదాలు ఇబ్బంది పెట్టాయా? అసలు 2025 సంవత్సరం తెలంగాణ కాంగ్రెస్ కు కలిసివచ్చిందా..లేదా.. తెలియాలంటే లెట్స్ రీడ్ దిస్ స్పెషల్ స్టోరీ.
తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరి రెండేళ్లు దాటింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక, 2024 సెప్టెంబర్‌లో బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ పగ్గాలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గాంధీభవన్‌కు గత వైభవం తెచ్చేలా ‘మంత్రుల ముఖాముఖి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేడర్‌కు నేతలు అందుబాటులో ఉండాలన్న ఆయన నిర్ణయం మొదట్లో మంచి ఫలితాలనిచ్చింది. కానీ రానురాను ఈ కార్యక్రమం రెగ్యులర్ గా సాగడం లేదు.
ఇక మంత్రుల విభేదాలు కూడా పార్టీకి ఈ ఏడాది హెడేక్ గా మారింది. కొండా సురేఖ పలు మార్లు చేసిన కామెంట్స్.. అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్ లో స్థానిక ఎమ్మెల్యే ల పై చేసిన కామెంట్స్ తో రచ్చ మొదలయింది. ఈ ఇష్యూ క్రమశిక్షణ కమిటి వరకు వెళ్ళింది. ఆదర్వాత అందరిని సైలెంట్ చేశారు తప్ప ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే కొండా సురేఖ కూతురు సిఎం పై చేసిన కామెంట్స్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొండా మురళి, సురేఖ కంప్లైంట్స్ ఆ వివాదం క్లోజ్ చేయడానికి పీసీసీ చీఫ్ చొరవ తీసుకొని ఇన్ ఛార్జ్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఇష్యూ క్లోజ్ చేశారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ‘కులగణన’ హామీని నిలబెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కులాల లెక్కలు చేసి బీసీల జనాభా 56 శాతంగా తేల్చారు. ఈ లెక్కలు తప్పుల తడకగా ఉన్నయాని సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని బహిరంగంగా లెక్కలతో సహా వ్యతిరేకించారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే రిపోర్టును తగులబెట్టి ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ క్రమశిక్షణే ముఖ్యం అని చెబుతూ మల్లన్నను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఇక బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలో 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు. దీని కోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపారు. ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ధర్నాలు చేసింది. కేంద్ర పెద్దలని కలిశారు. చివరకు జీవో నెంబర్ 9 రూపం లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో కామారెడ్డిలో బీసీ గర్జన సభను నిర్వహించాలనుకొని కొన్ని కారణాలతో వాయిదా వేయడం చర్చకు దారితీసింది.
పీసీసీ చీఫ్ గా కమిటి లు వేసుకోవడంలో మాత్రం మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ కాలేదనే విమర్శ ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఏడాది పూర్తి చేసుకున్న ఆయన కేవలం టీపీసిసి జనరల్ సెక్రటరీ లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లను మాత్రమే భర్తీ చేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకం మాత్రం పూర్తి చేశారు. కానీ పార్టీ లో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ లు, పీసీసీ సెక్రటరీ, స్పోక్స్ పర్సన్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటి మాత్రం నియామకం చేయలేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు ముందు అజురీద్తీన్ ను మైనారిటీ కోటాలో కేబినెట్ లోకి తీసుకోవడం పార్టీకి ఎంతో కొంత మేలు జరిగిందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.
Also Read..| కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి శపథం
మహేష్ కుమార్ గౌడ్ ఇన్ ఛార్జ్ తో కలిసి జనహిత పాదయాత్ర చేశారు. ఉమ్మడి జిల్లాలలోని ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఒక రాత్రి అక్కడే బస చేసి అందర్నీ కలుపుకొని పోయే ప్రయత్నం చేశారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థానాలు గెలువలేదు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం అభ్యర్థి ఎంపిక విషయం నుండి పూర్తిగా దృష్టి పెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించి తన ఖాతాలో వేసుకున్నారు పీసీసీ చీఫ్. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానల్లో గెలిచారు. ఇవి రెండు విజయాలు కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చాయని చెప్పవచ్చు.
వాయిస్ ఓవర్ 6: మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ చీఫ్ గా తప్పించి మంత్రి వర్గంలోనికి తీసుకుంటారనే చర్చ సైతం జోరుగా నడిచింది. పీసీసీ చీఫ్ -సీఎం రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందనే గుసగుసలు వినబడ్డాయి. అందుకు మహేష్ కుమార్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకోవడం లేదనే చర్చ పార్టీవర్గాల్లో నడిచింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఢిల్లోలో పీసీసీ చీఫ్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడటం కూడా రేవంత్ , మహేష్ కుమార్ గౌడ్ ల మద్య దూరం మరింత పెరిగిందనే వాదన గాంధీభవన్ వర్గాల్లో వినబడుతోంది. అంతేకాంకుండా.. కేబినెట్ బెర్తులను పీసీసీ గారు ఎవరికి ఇస్తున్నారు.. తేదీ చెబితే ఆ తేదీన ప్రమాణస్వీకారానికి హాజరవుతానని సీఎం తన సన్నిహితుల వద్ద అన్నాడని గుసగుసలు వినబడ్డాయి.. దీంతో ఈ ఇరువురి నాయకులమద్య దూరం పెరిగిందనే వార్తలకు బలం చేకూరినట్టయింది.
2025 ఏడాది లో కాంగ్రెస్ నాయకుల మద్య చిన్నచిన్నవి మినహా పెద్దగా కలహాలు ఏమీ కనిపించలేదు. పీసీసీ కమిటి లో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, డీసీసీ అధ్యక్షుల నియామకం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు, మెజారిటీ సర్పంచ్ స్థానాలు సాధించడం, జనహిత పేరుతో ఒక దఫా పాదయాత్ర చేయడం లాంటివి పార్టీకి కలిసి వచ్చాయి. అయితే, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో చాలామంది కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అసంత్రుప్తితో ఉన్నారు. కేబినెట్ లో కూడా ఇంకా రెండు బెర్తులు ఖాలీలు భర్తీచేయకపోవడం కూడా పార్టీకి మైనస్ గా మారింది. ఓవరాల్ గా కంటోన్మెంట్ ఉపఎన్నిక, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, సర్పంచ్ ఎన్నికల్లో విజయాలు పార్టీకి మైలేజ్ పెరిగిందనే చెప్పవచ్చు. మరి రానున్న ఏడాది లోనైనా పూర్తిస్థాయి కమిటిలు, పార్టీ బలోపేతం, నేతల మధ్య గ్యాప్ లేకుండా చూడడం పార్టీ – ప్రభుత్వం మధ్య గ్యాప్ లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడం, 42% బీసీ రిజర్వేషన్లు ఏవిధంగా అమలుచేస్తారో చూడాలి.









