యాంకర్‌గా అనతి కాలంలోనే విష్ణు ప్రియ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘పోవే పోరా’ అనే షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించి అభిమానులను మెప్పించింది. హీరోయిన్స్ లాగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో విష్ణు ప్రియ దిట్ట. విష్ణుప్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విష్ణుప్రియ మరోసారి తన అందంతో మతి పోగొడుతోంది. గ్లామర్ డోసేజ్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియ బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.









