ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాకు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు పడ్డాయి.
ఈ సినిమాతొ హీరోయిన్ వైష్ణవి చైతన్య చాలా ఫేమస్ అయింది. పెద్ద హీరోలు సైతం వైష్ణవి యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
తెలుగు ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya) పేరు మారుమోగిపోతోంది.
సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్ని చిన్న అవకాశాలతో నటించిన వైష్ణవి ఆ తరువాత హీరోయిన్ గా మారిపోయింది.
బేబీ సినిమా( Baby Movie)తో వైష్ణవి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
దాదాపు ఈ సినిమా 90 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమా తరువాత వైష్ణవికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ఈ సినిమా సక్సెస్ అవడంతో చాలా ఇంటర్వ్యూలలో వైష్ణవి చైతన్యకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
కొన్ని ఆమెకు వ్యక్తిగత విషయాలపై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి వైష్ణవి ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ గా మారాయి.
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడగగా.. తనను అర్ధం చేసుకునే మంచి మనసు ఉంటే చాలని.. ప్రత్యేకంగా ఆస్తులు, అందం ఉండాలని కోరుకోనని తన మనసులో మాటను చెప్పేసింది.