ఆర్ఆర్ఆర్ (RRR)సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు రామ్ చరణ్ తేజ అందించిన సేవలకు గుర్తించి, చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేయనుంది. ఈనెల 13న వర్శిటీ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్ ను అందజేయనున్నారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్, RC16 సినిమాల్లో నటిస్తున్నాడు.