సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సీనియర్ నటి షకీలా స్పందించారు. మహిళలపై లైంగిక వేధింపులు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో కూడా ఉన్నాయని షకీలా అన్నారు. సినీ పరకశ్రమలో కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా కనిపిస్తారని.. మొదట్లోనే తాము అలాంటి పనులు చేయమని గట్టిగా చెప్పేస్తే మున్ముందు సమస్యలు ఎదురుకావని అన్నారు. ఇలాంటి సంఘటనలపై వేసే కమిటీలు, అవి ఇచ్చే నివేదికలు కేవలం వేధింపుల విషయాన్నే బయట పెడుతున్నాయి.. కానీ, బాధ్యులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని షకీలా అన్నారు.