నోరా ఫతేహికి ఆశించినంతగా సినిమాల్లో లీడ్ రోల్ పాత్రల అవకాశాలు రావడంలేదు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తన బాధ బయటపెట్టింది. తనను సినీ నిర్మాతలు ప్రధాన పాత్రలకు ఎందుకు ఎంపిక చేయడంలేదో చెప్పేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం నలుగురు కథానాయికలకే వరుసగా అవకాశాలు ఇస్తున్నారని.. వారి గతం చూడకుండా సినిమా పెద్దలు ఆ నలుగురినే తమ సినిమాలలో లీడ్ పాత్రలకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది.
తనకు అవకాశాలు తగ్గడానికి ప్రధాన కారణం తన డ్యాన్స్ కాదని అంటుంది. పదే పదే కొందరినే తమ సినిమాల్లో దర్శక నిర్మాతలు తీసుకోవడం వలన తనకు అవకాశాలు పరిమితంగా వస్తున్నాయని ఈ ముద్దుగుమ్మ అభిప్రాయపడింది.
నోరా ఫతేహి 2014 సంవత్సరంలో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఓ సాకి సాకి, మనికే వంటి పాటలతో తన డ్యాన్స్ తో చాలా పాపులారీటీని సంపాదించుకుంది. తన డ్యాన్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలోనే సినిమాలు నిర్మిస్తున్నారని తెలిపింది. ప్రతీసారి అవకాశాలు రావడం కష్టమైన పనేనని అన్నారు. అవకాశం వచ్చేదాకా వేచిచూడాలికదా అని వివరించింది.