పూనమ్ బజ్వా 2005లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె నాగార్జునతో బాస్ సినిమాలో నటించింది. పరుగు సినిమాలో ఆమె ప్రకాష్ రాజ్ పెద్ద కుమార్తెగా అతిధి పాత్రలో కనిపించింది. 2008లో హరి దర్శకత్వం వహించిన మసాలా చిత్రం సేవల్‌తో తమిళంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం పూనమ్ తన ఫ్యాషన్ డ్సెస్ లకు కాస్త విరామం ఇచ్చినట్టుంది… ఎందుకంటే చాలా రోజుల తర్వాత చీరకట్టులో ఉన్న ఫోటోలను చూసి.. గ్లామర్ డోస్ కు గ్యాప్ ఇచ్చావా.. అని తన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.