‘రెడ్‌ఫ్లవర్’ (Redflower) సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంపోజింగ్ కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా పని చేస్తుంది. విఘ్నేష్ హీరోగా ఆండ్రూ పాండియన్ దర్శకత్వంలో శ్రీ కాళికాంబాల్ పిక్చర్స్ సమర్పణలో నిర్మాత కె మాణిక్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ రామ్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగా ఉండాలని దర్శక, నిర్మాతలు భావించారు. అందుకే హంగేరియన్ ఆర్కెస్ట్రా సాయంతో మ్యూజిక్ కంపోజింగ్ చేయిస్తున్నారు. డిఫరెంట్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. వీఎఫ్ఎక్స్, నేపథ్య సంగీతం పనులు సాగుతున్నాయి. తాను చేసే తొలి ప్రాజెక్టు ద్వారా తన ప్రతిభను నిరూపించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని దర్శకుడు సంతోష్ రామ్ తెలిపారు.