Friday, April 18, 2025
HomeCinemaBhola shankar review: భోళా శంకర్ రివ్యూ .. మెగాస్టర్ కొత్త సినిమా ఎలా ఉంది...

Bhola shankar review: భోళా శంకర్ రివ్యూ .. మెగాస్టర్ కొత్త సినిమా ఎలా ఉంది ?

సినిమా విడుదల: ఆగస్టు 11, 2023

నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు, రవిశంకర్,

శ్రీ ముఖి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, తులసి

సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర

మ్యూజిక్: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: డడ్లీ

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విజయం తరువాత భోళాశంకర్ గా అభిమానుల ముందుకు వచ్చారు. సినిమా విడుదల అయిన అన్ని థియేటర్లలో ప్రేక్షకులతో సందడి వాతావరణం కనిపిస్తుంది. షాడో సినిమా ఫ్లాప్ తరువాత దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మెహర్ రమేష్ లేటెస్ట్ గా ఓ రిమేక్ కథతో అభిమానులు ముందుకు వచ్చారు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదళం సినిమా రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాలతో సినిమా విడుదల అయింది. ఈ సినిమా ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో, అలాగే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్గులు తిరగ రాస్తుందో తెలుసుకుందాం.

పాత్రలు:

శంకర్ పాత్రలో- చిరంజీవి
చెల్లి మహాలక్ష్మి పాత్రంలో- కీర్తి సురేష్
లాయర్ లాస్య పాత్రలో- తమన్నా

కథ:


శంకర్ టాక్సీ నడుపుతూ తన చెల్ల్లులు మహాలక్ష్మితో కలిసి కోలకతా నగరానికి వస్తాడు. నగరంలో మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ.. అమ్మెస్తూ ఉంటారు. పోలీసులు కూడా వారిని పట్టుకోలేక పోతారు. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాల మద్యలో శంకర్ ఆ మాఫియాని టార్గెట్ చేస్తాడు. శంకర్ కు ఆ మాఫియాను ఎందుకు టార్గెట్ చేయవలసి వచ్చింది ?గతంలోనే మాఫియాతో శంకర్ కి సంబంధం ఉందా ? మధ్యలో లాయర్ లాస్య తో శంకర్ కథ ఎక్కడకు చేరుతుంది ? శంకర్ మాఫియాని అంతం చేశాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

oRpusaGA 1

విశ్లేషణ:


హై ఓల్టేజ్ తో వచ్చిన భోళా శంకర్ సినిమా, యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ముఖ్యమైన ఎలిమెంట్స్ మిస్ కావడం.. అలాగే కొన్ని చోట్ల స్లో నరేషన్, మరియు బోర్ కొట్టే సీన్స్, రెగ్యులర్ సన్నివేశాలు లాంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తం మీద ఈ సినిమాలో మెగాస్టార్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా మెప్పించలేకున్నా.. పరవా లేదని అభిమానులు అంటున్నారు. మొత్తానికి సినిమాను ఒకసారి చూడొచ్చని పలువురు విశ్లేసిస్తున్నారు.

న్యూస్2తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

F3QO67TWgAAQYdn
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments