Cinemaమన అనుకునే వారికోసం ఎంతవరకైనా వెళ్తా.. అల్లు అర్జున్

మన అనుకునే వారికోసం ఎంతవరకైనా వెళ్తా.. అల్లు అర్జున్

-

- Advertisment -spot_img

మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతుంది. అందరికి కనిపిస్తున్నట్లుగా, పరస్పర సంబంధాలు బాగానే ఉన్నట్లు అనిపించినా, వాస్తవంగా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోతున్నట్లే కనిపిస్తుంది. అల్లు అర్జున్ గురించి మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్లు, అందుకు బన్ని అభిమానుల నుండి వచ్చిన తీవ్ర ప్రతిస్పందన, ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసిన సంగతి తెలిసిందే.

ఈ పరిస్థితులలో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబు యొక్క ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేయించడానికి ఒత్తిడి పెట్టారు. ఈ పరిణామం మధ్య, పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా అల్లు అర్జున్ గురించి వ్యాఖ్యానించడం వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ముఖ్యంగా, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన తరువాత, మరోసారి అల్లు అర్జున్ స్పందించారు. ఆయన స్నేహితుడు సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా, అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ మాట్లాడుతూ, “నా ప్రియమైన అభిమానులు, మీరు నా ఆర్మీ. మీరు నా అభిమానులు అంటే నాకు ఎంతో ఆనందం. చాలా మంది హీరోని చూసి అభిమానులు అవుతారు, కానీ నేను నా అభిమానుల్ని చూసి హీరోనయ్యాను. నా నుండి కొత్త సినిమా వచ్చినప్పటికీ, మీ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ప్రేమించే వాళ్ల కోసం, మనకు ఇష్టమైన వారికోసం నిలబడగలగాలి ” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you