సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని హీరోయిన్ గా తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కాస్త జోరు తగ్గించింది. అయునా, తమన్నాకు ఏజ్ బార్ అవుతున్నా.. నటిగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
గత 15 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలిన తమన్నాకు చిన్నగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించింది. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా నటించింది. ఈ బ్యూటీ.
మూడు పదుల వయసు మీద పడుతున్నా ఇంకా వన్నెతగ్గని వయ్యారాలతో సందడి చేస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. వరుసగా సినిమాలు చేస్తుంది. కుర్ర కారుకు మాత్రం తన అందం, అభినయంతో కిక్కెక్కిస్తోంది.
అంతే కాకుండా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ.. మెరుపులు మెరిపిస్తోంది. తమన్నా ఓ బయోపిక్ సినిమాలో నటించబోతున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. అది కూడా దివ్య భారతి పాత్రలో అని అంటున్నారు. అందులో నిజమెంత.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
దివ్యభారతి 1990 లలో స్టార్ హీరోలతో నటించింది. షారుఖ్ ఖాన్, గోవింద లాంటి అగ్ర హీరోలతో నటించి, తాను ఓ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది దివ్యభారతి.
హిందీలో మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది. దివ్యభారతి చాలా చిన్నవయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
తక్కువ సమయంలోనే పాపులర్ స్టార్‌గా ఎదిగిపోయింది. 19 ఏళ్ల వయసులోనే ముంబాయిలోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. కానీ ఇప్పటికీ కూడా దివ్యభారతి మరణం వెనుక ఏదో కథ ఉందని అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు.