సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (casting couch) అనే పదం గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు నటీమనులు బహిరంగంగానే చెప్పారు. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని జూనియర్ ఆర్టిస్ట్ లు చాలా సంధర్భాలలో వెల్లడించారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ (Actress Radhika sarathkumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు లైంగిక వేధింపులు అన్నిఇండస్ట్రీలలోనూ ఉన్నాయని అన్నారు. కొంతమంది వ్యక్తులు కారవాన్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి… ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అక్కడ చిత్రీకరించిన వీడియోలను సెట్స్ లోనే పలువురు మొబైల్స్ లో షేర్ చేసుకొని చూడటాన్ని తాను గమనించానని.. అందుకే తాను బట్టలు మార్చుకోవడానికి కారవాన్ ఉపయోగించనని, హోటల్ రూమ్ కు వెళ్లి బట్టలు మార్చుకునే దానిని రాధిక వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాధిక కామెంట్స్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.