ఇటీవల మా అధ్యక్షుడు మంచు విష్ణు తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్ నటి మీనా అభినందిస్తున్నారు. సినీ నటులను విమర్శిస్తూ, నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న 18 యూట్యూబ్ ఛానల్స్ ను ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు రద్దు చేయడం జరిగింది. వారు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను అసత్య ప్రచారాలను తీసుకెళుతున్నారని ఆ యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినీనటి మీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీని కాపాడాలంటే ఇలాంటి నిర్ణయాలు అవసరం అని ఆమె తెలిపారు.