అందాల చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. తేజ దర్శకత్వంలోఈ సినిమా తెరకెక్కింది.
ఆతర్వాత వచ్చిన చందమామ సినిమాతో పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహిస్తున్నఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నూతన సంవత్సరంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో కూడా కాజల్ బాలయ్యతో ఓ సినిమాలో నటిస్తోంది.