రీసెంట్ గా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఆయ్ సినిమా విడుదల అయింది. కామెడీ, లవ్, కుటుంబ బంధాలు ఇతివృత్తంగా ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలయి.. పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేనే సెలెక్ట్ చేసి.. కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చారట. ఆగ్యాప్ లోనే డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి భాగ్యశ్రీ బోర్సేకు మిస్టర్ బచ్చన్ సినిమా కోసం రవితేజ పక్కన హీరోయిన్‌గా ఆఫర్ రావడంతో ఆయ్‌ని భాగ్యశ్రీ పక్కనపెట్టారట. అలా ఆయ్ సినిమాను ఈ అమ్మడు మిస్ చేసుకుంది. ఇప్పుడు సినిమాల విడుదల తర్వాత మిస్టర్ బచ్చన్ ఫర్వాలేదనిపించుకోగా.. ఆయ్ మాత్రం సూపర్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. దీంతో నెటిజన్లు భాగ్యశ్రీ డిసెషిన్‌పై తెగ ట్రోల్ చేస్తున్నారు. బ్లాక్ బాస్టర్ సినిమాను వదులుకొని.. డిజాస్టర్ మూవీని సెలెక్ట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమయినా ఏసినిమా హట్టవుద్దో.. ఏసినిమా ఫ్లాప్ అవుద్దో ముందుగానే ఎవరూ ఊహించరు కదా.. అని మరికొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.