Menu

  • Home
  • సినిమా
  • దుబాయ్ లో చిక్కుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్.. మోడీకి రిక్వెస్ట్
sonal chouhan

దుబాయ్ లో చిక్కుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్.. మోడీకి రిక్వెస్ట్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ద సంక్షోభంలో టాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ దుబాయ్ లో చిక్కుకుపోయారు. ఇరాన్ వైమానిక దాడులు , ప్రతిగా ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సైనిక చర్యల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో విహారయాత్ర కోసం అక్కడికి వెళ్లిన సోనాల్, స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

sonal chouhan iran israel dubai

ప్రధాని మోదీ గారు.. ప్రస్తుతం దుబాయ్‌లో నెలకొన్న యుద్ధ ప్రాతిపదికన సంక్షోభం వల్ల నేను ఇక్కడ చిక్కుకుపోయాను. విమానాలన్నీ రద్దయ్యాయి, తిరిగి రావడానికి ఎటువంటి దారి కనిపించడం లేదు. దయచేసి నేను సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా సహకారం అందించాలనిఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు.

cdccd8d5 e6e0 4599 b45a 70c31c8ddbc8

Also Read..| ఇరాన్ సుప్రీం ఖమేనీ హతం.. ప్రతిగా ఇరాన్ భీకర దాడులు

Share the post