బోల్డ్ మూవీలో తమన్నా నటిస్తోంది. సరిహద్దులు చెరిపేస్తోంది మిల్కిబ్యూటీ! ఇన్నాళ్లూ ‘నో’ చెప్పిన వాటికి ఇప్పుడు ‘ఓకే’ అంటోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఒక నటిగా తనలోని మరో కోణాన్ని చూపించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో, ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే తన పాత పద్ధతిని పక్కనపెట్టి, ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ఇప్పుడు, ఏకంగా బాలీవుడ్‌లోని ఓ సంచలన చిత్రంలో నటించబోతోంది.
బాలీవుడ్లో హారర్, రొమాన్స్‌ని కలగలిపి సంచలనం సృష్టించిన ‘రాగిణి MMS‘ గురించి అందరికీ తెలుసు. ఈ సిరీస్‌లోని పార్ట్-2లో సన్నీ లియోన్ నటించిన తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలాంటి సినిమాలో తమన్నా నటించడానికి అంగీకరించింది. ఈసారి రొమాంటిక్ సన్నివేశాలు మరింత ఘాటుగా ఉండబోతున్నాయని నిర్మాత ఏక్తా కపూర్ చెప్పినట్లు సమాచారం.
Also Read..| ‘నేను రెడీ’ తో హీరోయిన్ కావ్య థాపర్‌కు సాలిడ్ ఛాన్స్ !
అవకాశాల కోసం కొన్నింటిని వదులుకోవడం వల్ల కెరీర్ దెబ్బతింటుందని భావించిన తమన్నా, ఇప్పుడు తన ఆలోచనలను మార్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెను చూసి ప్రేక్షకులు ‘తమన్నా సార్.. తమన్నా అంతే’ అని అంటారేమోనని అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ బోల్డ్ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.









