కళాతపస్వి కె.విశ్వనాథ్ ( K.Viswanath) అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి కన్ను మూశారు (K. viswanth passed away). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని అపోలో ఆసుత్రిలో చకిత్స తీసుకుంటూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో (Narendra modi) సహా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు.
సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు 1930 ఫిబ్రవరి 19 న విశ్వనాథ్ జన్మించారు. ఇంటర్మీడియట్గుం టూరులోని హిందూ కాలేజీలో, బీఎస్సీ డిగ్రీని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేశారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం మద్రాసులోని విజయావాహిని స్టూడియోలో పని చేసేవారు. విశ్వనాథ్ తన డిగ్రీ అనంతరం ఈ స్టూడియోలోనే సౌండ్ రికార్డిస్ట్ గా తన సనీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పాతాళభైరవి సినిమాను ఆయన పని చేశారు. ఆ తరువాత 1965 లో మొదటి సారిగా ‘ ఆత్మగౌరవం ‘ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. తీసిన మొదటి సినిమా నంది అవార్డు వరించిందంటే ఆయన దర్శకత్వ పటిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లో కూడా పది సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన ఆణిముత్యాల లాంటి సినిమాలను అందించారు. ముఖ్యంగా సాగర సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, శుభసంకల్పం, ఆపద్బాందవుడు, స్వాతికిరణం, జీవనజ్యీతి, ఓ సీత కథ లాంటి అజరామరమైన చిత్రాలు ఆయన దర్శకత్వం వహించినవే. సినీరంగానికి ఆయన చేసిన ఎనలేని కృషికి గాను 2016లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
సిరివెన్నెల, సాగరసంగమం, స్వయం కృషి సినిమాలను ఏసియా పసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో ప్రదర్శించారు. స్వయం కృషి సినిమాను మాస్కో లో నిర్వహించిన చలనచిత్ర వేడుకలలో ప్రదర్శించారు. 1992లో పద్మశ్రీ పురస్కారంతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డులను అందుకున్నారు. 59వ ఆస్కార్ అవార్డులలో పోటీకి నామినేట్ అయింది. ప్రాంతీయ విభాగంలో స్వరాభిషేకం సినిమాకు జాతీయ అవార్డు వరించింది. పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ ఆయనకు గౌరవ డక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది.
నటనలో కూడా విశ్వనాథ్ పలు కీలక పాత్రలు పోషించారు. స్వరాభిషేకం, నువ్వులేక నేను లేను, నరసింహ నాయుడు, ఠాగూర్, కసిసుందాంరా, లక్ష్మీ నరసింహ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఆయన మరణంతో సనీ పరిశ్రమలో విషాదం అలుముకుంది.
కె.విశ్వనాథ్ గారి మృతి నన్ను ఎంతో బాదించింది: ఇళయరాజా
భారతదేశ సనిమా చరిత్రలో గొప్ప డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త నన్ను ఎంతో బాధించిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
కె.విశ్వనాథ్ గ్రేట్ విజనరీ డెరెక్టర్ : గుణశేఖర్
ఆయన సినిమాలు ప్రతీ ఒకటి ఒక్కో పుస్తకం. నా లాంటి ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. మాటలు వినపడడం కాదు కనపడాలి అనే దర్శకత్వ ప్రాథమిక సూత్రం ఆయన సినిమాలలో ప్రతిబింభిస్తుంది. ఆమన మన మధ్యలో సజీవంగా ఉంటారు. ఆయన చాలా గొప్ప విజనరీ డైరెక్టర్.
ఆయన ప్రతిభను చెప్పడానకి నా స్థాయి సరిపోదు: చిరంజీవి
పితృ సమానులు, అత్యంత ఆప్తులు, గురుతుల్యులు, నాకు అత్యంత ఆప్తులు కళాతపస్వి విశ్వనాథ్ గారు ఇక లేరనే మాట నన్ను ఎంతగానో బాధించింది. ఆయన దర్శకత్వ ప్రతిభను చెప్పడానికి నా స్థాయి సరిపోదు. తెలుగు సనిమా కీర్తని ప్రపంచ స్థాయికి తీసుకవెళ్లాన ఘనత ఆయనదే. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగఢ సంతాపాన్ని తెలియజేశారు.
తెలుగు సినిమాను ఖండాంతరాలు దాటించారు : జూనియర్ ఎన్టీఆర్
కె. విశ్వనాథ్ గారి మరణ వార్తను విని దిగ్బ్రాంతికి లోనయ్యాను. సాగర సంగమం, శంకరాభరణం లాంటి ఎన్నో అపురూప సినిమాలను అందించారని ఆయనను కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని.. వారి కుటుబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు.
కె.విశ్వనాథ్ మరణ వార్త తనను దిగ్భ్ర్రాంతికి గురి చేసిందని మమ్ముట్టి తెలిపారు. ఆయన దర్శకత్వంలో స్వాతి కిరణం సినిమాను చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన మరణాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఇవ్వాలని ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలిపారు.
సాధారణ కథలను వెండితెర దృశ్యకావ్యాలుగా మలచిన అరుదైన దర్శకుడు : తెలంగాణ సీఎం కేసీఆర్
కళాతపస్విగా తన పేరును మార్చుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్.. తన సినిమాలలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగుదనాన్ని, సంప్రదాయాల్ని తన సినిమాలలో చూపించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. ఆయన మరణం పట్ల సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కె.విశ్వనాథ్ తన ప్రతిభతో సాదారాణ కథలను సైతం వెండితెర దృశ్యకావ్యాలుగా మలచిన అరుదైన దర్శకుడు అని కెసీఆర్ అన్నారు. ఆయనతో సాహిత్యం, సంగీతం వంటి అంశాలపై జరిగిన చర్చను కేసీఆర్ ఈ సంధర్బంగా గుర్తు చేసుకున్నారు.
కె.విశ్వనాథ్ పేరు స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది : బండి సంజయ్
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నకళాతపస్వి, లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ మరణం సినీ పరిశ్రమకు తీరిని లోటు అని అన్నారు. సంస్కృతీ, సంప్రదాయలకు, నమ్మిన విలువలకు, సిద్దాంతాలకు, సంగీతానికి అధిక పాధాన్యం ఇస్తూ తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. భారతీయ సినిమా ఉన్నన్ని రోజులు కె.విశ్వనాథ్ పేరు స్ధిరస్థాయిగా ఉంటుందని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆభగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థిస్తున్నాని బండి సంజయ్ తెలిపారు.
తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచి ఉంటారు : ఎపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కె.విశ్వనాథ్ వంటి దర్శకుడి మరణం తెలుగు సినీ లోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని దేవున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
కె.విశ్వనాథ్ సినీ ప్రపంచంలో దిగ్గజం.. బహుముఖ ప్రజ్ఞాశాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సృజనాత్మకత గల దర్శకుడిగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి కె.విశ్వనాథ్ అని తెలిపారు. వివిధ రకాల ఇతివృత్తాలతో ఆయన తీసిన సినిమాలు కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. కె.విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. ఓం శాంతి అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ముగిసిన అంత్యక్రియలు
కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం మద్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో సాంప్రదాయాల ప్రకారం ముగిశాయి. అంతిమ సంస్కారాలకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరయ్యారు. ఆయన నివాసం ఫిలిం నగర్ నుండి పంజాగుట్ట స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.