మహిళా టీ20 వరల్డ్ కప్ 2024 క్వాలిఫయర్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే నెల 25 నుంచి మే 7వరకు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-A లో శ్రీలంక, థాయిలాండ్, స్కాట్లాండ్, ఉగాండా, యూఎస్ఏ ఉండగా.. గ్రూప్-B లో ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, యూఏఈ, వనాటు ఉన్నాయి. ఫైనల్ చేరిన 2 జట్లు టీ20 WC కి అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది..