రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుసున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు, మోతె రోడ్డు లోని నీట మునిగిన ప్రాంతాన్ని, బైపాస రోడ్డు లోని 19 వార్డు 3 వార్డు, తులసి నగర్ ,గాంధీ నగర్ , ఖిల గడ్డ ,సలీమ గార్డెన్ ప్రాంతాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు.