రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయి అనుకుంటున్న సమయంలో.. వరంగల్ లోని భద్రకాళి చెరువుకు పెద్ద గండి పదింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతికి పోతననగర్ వైపు ఉన్న చెరువు కట్ట కోతకు గురైంది. చెరువులోని నీరు గండి గుండా బయటకు వెళ్ళిపోతుంది. చెరువుకు గండి పడటంతో పోతననగర్, సరస్వతి నగర్ ప్రజలు భయాందోళనకు గురవుతన్నారు.