విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం గాంధీభవన్ లో ఖర్గే, ఇతర రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. విజయశాంతికి మెదక్ ఎంపీ సీటు హామీ ఇచ్చాకనే పార్టీలో చేరారు అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు విజయశాంతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఎంతో ఆదరణతో, సమున్నతమైన గౌరవంతో స్వాగతించిన, కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు..
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 17, 2023
హరహర మహాదేవ్
జై తెలంగాణ
జైహింద్ pic.twitter.com/Xxqsm9O10e