చెన్నూర్ నియోజకవర్గంలో బాల్క సుమన్ ను ఓడించాలని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయన స్వలాభం కోసం గుండా రాజకీయం చేస్తూ.. పబ్బం గడుపుతున్నారని వారు మండిపడ్డారు. చెన్నూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. చెరువు శిఖం భూముల్లో ఇళ్లు కట్టిన ఘనత బాల్క సుమన్ కే దక్కుతుందని అన్నారు. కేవలం కమీషన్ ల కోసమే పనులు చేపిస్తున్నాడని ఆరోపించారు. వంద రూపాయలు కూడా లేని బాల్కసుమన్ కి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాన్ని అంతమొందించాలి అంటే బాల్కసుమన్ ని ఓడించి ఇంటికి పంపించాలని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి గడపగడపి తిరిగి బాల్కసుమన్ చేసిన అరాచకాలకు ప్రజలకు వివరిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.