ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు ను తుళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనను పోలీసులు కస్టడీకి కోరారు. న్యాయస్థానం అనుమతితో కృష్ణంరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు.
తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు జర్నలిస్ట్ కృష్ణంరాజు
ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం, ఆయనను తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాబోయే మూడు రోజుల పాటు కృష్ణంరాజును పోలీసులు విచారించనున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది, అలాగే ఇతర సంబంధిత అంశాలపై పోలీసులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.
Also Read..| ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి: ఎమ్మెల్సీ కవిత