తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ 6 హామీలను ప్రకటించిన తర్వాత.. కేసీఆర్, కేటీఆర్ లకు ఏం చేయాలో అర్థం కావడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి 99 రోజుల సమయం మాత్రమే ఉందని, తరువాత ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ జోస్యం చెప్పారు.
రేవంత్ రెడ్డి ట్వీట్..
తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి,
అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్న అయ్యా, కొడుకులకు..
మా నాయకులు
రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో..
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన
దగాకోరును గద్దె దించడం గ్యారంటీ…!
మూడెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వెనకేసిన
భూబకాసురులను బొందపెట్టడం గ్యారంటీ…!
కాపలా కుక్కలాగా ఉంటానని, ఖజానాను కొల్లగొడుతున్న
దొంగల ముఠాను తరిమికొట్టడం గ్యారంటీ…!
కమీషన్లను దండుకోవడమే ‘మిషన్’ లాగా పెట్టుకున్న
వసూల్ రాజాల భరతంపట్టడం గ్యారంటీ…!
పదేండ్లలో వందేండ్ల విధ్వంసం సృష్టించిన
వినాశకారులను పాతరేయడం గ్యారంటీ…!
తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన
‘గులామీ’ గ్యాంగును పాతాళానికి తొక్కడం గ్యారంటీ…!
నాలుగు కోట్ల ప్రజల కళ్లుగప్పి తెలంగాణ సంపదను వాటాలేసి పంచుకుంటున్న తోడు దొంగల
ముసుగులను ఊడదీసి ప్రజాక్షేత్రంలో ఉరికించడం గ్యారంటీ…!
అధికారం శాశ్వతం అనుకుని నీలిగిన నిజాం రాచరికాన్నే పీచమణిచిన గడ్డ ఇది..
మీరొక లెక్కా..?
అధికారంలోకి వస్తున్నాం.. అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం..
జై కాంగ్రెస్!
జై తెలంగాణ!
తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి,
— Revanth Reddy (@revanth_anumula) September 18, 2023
అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్న అయ్యా, కొడుకులకు..
మా నాయకులు @RahulGandhi గారు చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో..
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన
దగాకోరును గద్దె దించడం గ్యారంటీ…!
మూడెకరాల… https://t.co/XUHIjD2z71