అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారలు బేస్ క్యాంపు ఆవరణంలో హరితహారం మొక్కలు నాటారు. . నల్లమల అడవిలో పులుల సంచారంపై సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నల్లమలలో క్రమ క్రమంగా పులుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంటున్నారు. అమ్రాబాద్ నల్లమల అడవిలో 23 ఆడ పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశంలోనే పులులకు నివాసంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉందని అన్నారు. ప్రపంచ టైగర్స్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన నిమిత్తమై ర్యాలీ నిర్వహించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
