Home News Telangana ప్రముఖ జర్నలిస్టు వినయ్ వీర్ మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దిగ్భ్రాంతి

ప్రముఖ జర్నలిస్టు వినయ్ వీర్ మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దిగ్భ్రాంతి

ప్రముఖ జర్నలిస్టు, హిందీ మిలాప్ సంపాదకులు వినయ్ వీర్ మరణం పట్ల వినయ్‌ వీర్‌ మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షలు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం తెలియజేశారు. వినయ్ పత్రికా వీర్ మరణం పత్రికా రంగానికి, ముఖ్యంగా హిందీ జర్నలిజానికి తీరని లోటు అని వారు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యుధ్ వీర్ కుమారుడైన వినయ్ వీర్ దక్షిణాదిన హిందీ జర్నలిజంలో ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు. తండ్రి మరణానంతరం యుధ్ వీర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించారని కొనియాడారు. ఫోటో జర్నలిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share the post
Exit mobile version