Home News Telangana కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ సీరియస్.. విచారణకు ఆదేశం

కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ సీరియస్.. విచారణకు ఆదేశం

మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమీషన్ సుమొటోగా స్వీకరించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్ లు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల కేటీఆర్ అవమానకరంగా మాట్లాడాడని మహిళా కమీషన్ అభిప్రాయపడింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఈ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేస్తే తప్పేంటని మంత్రి సీతక్క వ్యాక్యానిస్తే.. కేటీఆర్ స్పందిస్తూ.. మహిళలు కుట్లు, అల్లికలే కాదు.. బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. ఈ వ్యాక్యలపై మహిళా కమీషన్ తాజాగా విచారణకు ఆదేశించింది.

Share the post
Exit mobile version