హైదరాబాద్ లోగత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో చాలా చోట్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలో సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి నగరవాసులందరూ తమ తమ ఇండ్లల్లోనే ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని మేయర్ విజయలక్ష్మీ సూచించారు. మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాలలో ప్రజలు ఉండకూడదని, వెంటనే అందులో నుంచి వేరే చోటుకు మారాలన్నారు. వర్షాలకు సంబంధించిన సమస్యలు, సహాయం కొరకు 040-21111111 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నభారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
#WATCH | Hyderabad city is likely to have light to moderate rains during the next 24 hours. There is a slight decrease in rainfall over the city with light to moderate rains and intense spells and wind speed: Director of Hyderabad Meteorological Center Dr K Nagaratna pic.twitter.com/17NXoPdzdV
— ANI (@ANI) July 20, 2023