రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విధ్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్నిరకాల విద్యాసంస్థలకు బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ర్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గత వారంలో గురువారం నుండి శనివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను డిక్లేర్ చేసింది.