తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పోచారం ఇంటికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. చర్చల అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డికి, కుమారుడు ఇద్దరూ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి.
— Telangana Congress (@INCTelangana) June 21, 2024
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి, టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. pic.twitter.com/Jl66KfDZC2