డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ సముదాయం ప్రాగంణంలో నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చి ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రార్థనా మందిరాలను ప్రారంభించనున్నారు. రోడ్లు, భవనాలు, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలసి సి.ఎస్ పర్యవేక్షించారు. నల్ల పోచమ్మ ఆలయంలో జరిగిన పూజల్లో సీఎస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి టికె శ్రీదేవి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.