తెలంగాణ మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ఈనెల 20వ తేదీన జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పలు అంశాలు ఈసమావేశంలో చర్చకువచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటీవల వచ్చిన వరదలు, కేంద్రప్రభుత్వ సహకారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో సంచలనంగా మారిన హైడ్రాపై కూడా చర్చించనున్నారు. హైడ్రా చట్టబద్దతకు సంబందిచి ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై చర్చకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు, 200 పంచాయితీల ఏర్పాటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇతర అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు.