ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి బలం పుంజుకొని.. 35.02 శాతం ఓటు షేర్ తో 8 ఎంపీ సీట్లు సాధించడంతో.. తెలంగాణ బిజెపి శాఖను నిర్మలా సీతారామన్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికి రానున్న రోజుల్లో విశేషంగా నిధులు కేటాయించి, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కేంద్ర మంత్రిని సుభాష్ కోరారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్ సుభాష్ కు సూచించారు.
Shri @nvsubhash4bjp, Spokesperson – @BJP4Telangana, calls on Smt @nsitharaman. pic.twitter.com/7RekFhTuTe
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) June 14, 2024